సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదు: షిండే

5
- Advertisement -

సీట్లకు, సీఎం పదవికి సంబంధం లేదు అన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని… సీఎం పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కూటమి విజయానికి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలిచాయని …ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా అన్నారు. గతంలో తాను ఒక ఆపరేషన్ చేశానని, కుట్లు కూడా వేయకుండా ఆపరేషన్ జరిపానని తెలిపారు. నేను డాక్టర్‌ను కాను… అయినా ఏడాదిన్నర క్రితం ఒక ఆపరేషన్ చేశాను… కుట్లు వేయకుండానే ఆపరేషన్ జరిగిందన్నారు. అంతకంటే ఏమీ చెప్పలేను. ఇది ట్రయిలర్ మాత్రమే, ఫిల్మ్ ఇంకా రావాల్సి ఉంది అని సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు.

మహాయుతిలో 120కిపైగా స్థానాల్లో విజయాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. దీంతో సీఎం పదవి బీజేపీకే దక్కుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో కీలక కామెంట్స్ చేశారు షిండే.

Also Read:KTR: నియంతలా రేవంత్ పాలన?

- Advertisement -