ఎక్కిళ్లను ఆపడం ఎలా?

49
- Advertisement -

ప్రతి ఒక్కరికి ఎక్కిళ్ళు రావడం అనేది ఒక సర్వసాధారణ సమస్య. ఎక్కిళ్ళు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. వేగంగా తిన్నప్పుడు, లేదా నీళ్ళు తక్కువగా తాగినప్పుడు, ఎక్కిళ్ళు వస్తుంటాయి. మద్యం ఎక్కువగా సేవించే వారిలోనూ, మందులు ఎక్కువగా తీసుకునే వారిలోనూ తరచుగా ఎక్కిళ్ళు ఏర్పడుతుంటాయి. అయితే ఈ ఎక్కిళ్ళు కొద్దిసేపు తరువాత తగ్గిపోయినప్పటికి.. కొందరిలో మాత్రం ఏకధాటిగా వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు నీళ్ళు తాగడం లేదా ఏదైనా మెడిసన్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు చాలామంది. ఈ ఎక్కిళ్ళ సమస్య ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాము. మరీ ఈ ఎక్కిళ్ళు తగ్గెందుకు మెడిసన్ కంటే ఇంటి చిట్కాలు అద్బుతంగా పని చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

Also Read: Salaar:ఊరమాస్ టీజర్

ఎక్కిళ్ళు తగ్గించడంలో శొంఠి అద్బుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొద్దిగా శొంఠి మరియు బెల్లం కలిపి మెత్తగా చేసుకొని ఆ మిశ్రమాన్ని తింటే వెంటనే ఎక్కిళ్ళ నుంచి విముక్తి లభిస్తుంది. శొంఠిలో ఉండే ఔషధ గుణాలు ఎక్కిళ్లను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తాయట. అంతేకాదు శొంఠి పొడిని కొద్దిగా తేనెతో కలిపి సేవించిన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఇవే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా కొన్ని చిట్కాలను పాటించవచ్చు. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తున్నప్పుడు కొన్ని క్షణాలు శ్వాసను బిగబట్టి ఉండడం వల్ల వేగస్ నాడీ ఉత్తేజానికి లోనై ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఇంకా నాలుక కొనలను లాగడం, చెవుల్లోకీ గాలి వెళ్లకుండా చేతులను అడ్డుపెట్టుకోవడం వంటివి చేయడం వల్ల కూడా ఎక్కిళ్ళు ఆగిపోతాయని పలు అద్యయానాలు చెబుతున్నాయి. అయితే ఎక్కిళ్ళు నిర్విరామంగా, ఏకధాటిగా వస్తున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆగని పక్షంలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: ఇంట్రెస్ట్‌గా ‘ఖుషీ’ క్లైమాక్స్‌

 

- Advertisement -