వికెఎ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తన ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం “ఇగో”. విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ రాజ్-సిమ్రాన్ లు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం లాస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలవ్వనుంది. ఈ సందర్భంగా “ఇగో” మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “ఇగో” మూడు షెడ్యూల్స్ లో దాదాపు 80% చిత్రీకరణ పూర్తి చేసుకొంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుంది. అనుకొన్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నాం. నేడు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశాం అన్నారు.
ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావురమేష్, పోసాని కృష్ణమురళి, పృధ్వి, గౌతంరాజు, షకలక శంకర్, చంద్ర, వేణు, శివన్నారాయణ, భద్రం, రైజింగ్ రాజు, గుండు మురళిలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె, ఆర్ట్: ఆర్.కె, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, నిర్మాతలు: విజయ్ కరణ్-కౌసల్ కరణ్-అనిల్ కరణ్, రచన-దర్శకత్వం: సుబ్రమణ్యం.