అందాల ఈషా…అదరగొట్టింది..!

141
eesha
- Advertisement -

అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన తెలుగు భామ ఈషా రెబ్బా. తర్వాత ‘బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసతో మెప్పించిన ఈషా… నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

తర్వాత ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత వీరరాఘవ’లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా తన లేటెస్ట్ పిక్‌ని షేర్ చేసింది ఈషా.

ప్రస్తుతం అప్ కమింగ్ తమిళ్- మలయాళం బైలింగ్వేల్ మూవీతో మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేయబోతుంది. డైరెక్టర్ ఫెల్లిని రూపొందిస్తున్న ఈ సినిమాకు ఒట్టు అనే టైటిల్ ను ఖరారు చేయగా అరవింద్ స్వామి కీ రోల్ పోషిస్తోంది. మలయాళం ఎంట్రీ ఇస్తున్న ఈషా…అక్కడ రాణించాలని ఆకాంక్షిద్దాం.

- Advertisement -