ఎన్టీఆర్ సినిమాలో ఈషా రెబ్బ..

188
Eesha Rebba in Jr NTR, Trivikram Srinivas’s film
- Advertisement -

మాటల మాంత్రికుడు తివ్రిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్నచిత్రం అర‌వింద స‌మేత‌..వీర రాఘ‌వ‌. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Eesha Rebba in Jr NTR, Trivikram Srinivas’s film

ఇక ఇటీవల ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుకగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్. ఇందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇక విషయమేమిటంటే `అ!` సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బ‌. గతంలో అమీ తుమీలో తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ‘అర‌వింద స‌మేత’లో నటించే అవకాశం దక్కింది.

ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం ఈషారెబ్బ‌ను త్రివిక్రమ్ ఏరికోరి సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఈ మూవీలో ఈషా పాత్ర కొత్తగా కనిపించనుందట. వరుస అఫర్లతో జోరుమీదున్న ఈషా ప్రస్తుతం సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సుబ్రహ్మణ్యపురం’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

- Advertisement -