‘డ్రైవర్ రాముడు’.. టీజర్ వదిలిన సుధీర్ బాబు..

238
Driver Ramudu Teaser Launch by Sudheer Babu
- Advertisement -

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరోగా రాజ్ స‌త్య దర్శకత్వంలో సినిమా పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్రైవర్ రామూడు’. ఇటీవలే మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఇటీవలే విడుదలైన మొదటి ప్రచార చిత్రం సినిమా అంచనాలను రేటింపు చేసింది. ఇప్పుడు సినిమాకు సంభందించి మొదటి టీజర్‌ను విడుదల చేశారు. సక్సెస్ ఫుల్ హీరో సుధీర్ బాబు ‘డ్రైవర్ రాముడు’ మొదటి టీజర్‌ను విడుదల చేశారు.

Driver Ramudu Teaser Launch by Sudheer Babu

అనంతరం సుధీర్ బాబు మాట్లాడుతూ.. “నాకు కమెడియన్స్‌లో నచ్చిన నటుడు షకలక శంకర్. ఒక్క సినిమాతో షకలక శంకర్ కమెడియన్‌గా ఉన్నాడు అంటే ఆ చిత్రం లోని కామెడీ ఖచ్చితంగా బాగుంటుంది, ఇప్పుడు తాను హీరోగా వస్తున్నాడు అంటే ఈ చిత్రంలో కామెడీ అద్భుతంగా ఉంటుంది అని అర్ధం అయింది. ఈ డ్రైవర్ రాముడు చిత్రం టీజర్ నేను విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలైన వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్‌లకు మరియు దర్శకుడు రాజ్ స‌త్య కి నా శుభాకాంక్షలు. డ్రైవర్ రాముడు సినిమా మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ… ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్‌లో మ‌రో కొత్త కొణం ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంక‌ర్ మార్క్ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది. మా సినిమా టీజర్ ను సుధీర్ బాబు రిలీజ్ చేయటం మా అదృష్టం. సినిమా ప్రేక్షకులందరికీ నచుతుంది” అని తెలిపారు.

Driver Ramudu Teaser Launch by Sudheer Babu

నిర్మాతలు మాట్లాడుతూ.. “మా డ్రైవర్ రాముడు సినిమా టీజర్‌ని సుధీర్ బాబు విడుదల చేయటం మా అదృష్టం. వారు టీజర్ ని చూసి చాలా బాగుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని కొనియాడారు. ఈ సినిమా విడుదల సమయానికి సుధీర్ బాబుకి ప్రత్యేకమైన షో వేస్తాము. త్వరలోనే సినిమా విడుదలకు అని కార్యక్రమాలు పూర్తి చేస్తాము” అని తెలిపారు.

ఈ చిత్రంలో శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు. బ్యానర్- సినిమా పీపుల్స, సమర్పణ – మాస్టర్ ప్రణవ్ తేజ్, మ్యూజిక్ – సునీల్ కశ్యాప్,ఆర్ట్ – రఘు కుల్ కర్ణి,డిఓపి – అమర్ నాథ్ , నిర్మాతలు – వేణు గోపాల్ కొడుమగుళ్ల , ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్, దర్శకత్వం – రాజ్ సత్య.

- Advertisement -