Eesha Rebba:ఈషా కెరీర్ సెట్ అవుతుందా?

51
- Advertisement -

తెలుగు బ్యూటీ ‘ఈషా రెబ్బా’ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అచ్చ తెలుగు హీరోయిన్ గా ఈషా రెబ్బాకి మంచి గుర్తింపు వచ్చింది. కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ, చిన్న సినిమాల హీరోయిన్ గా కూడా ఆమెకు ప్రస్తుతం స్టార్ స్టేటస్ లేకుండా పోయింది. అటు వెబ్ సిరీస్ ల్లోనూ నటించినా.. ఈషా రెబ్బాకి ఎక్కడా బ్రేక్ రాలేదు. ఇప్పుడు ఆమెకు ఆ ఛాన్స్ లు ఇవ్వడం లేదు. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేస్తోంది. అయినప్పటికీ, తనకు వరుస అవకాశాలు రావడం లేదు.

మొత్తానికి ఈషా రెబ్బాకి చివరకు నిరాశే మిగిలింది. ఆశించిన స్థాయిలో ఆమెకు ఛాన్స్ లు రాలేదు. ఇక ఎదురు చూసి చూసి విసిగిపోయిన ఈషా రెబ్బా, సైడ్ క్యారెక్టర్స్ కి కూడా తాను సిద్ధం అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ అందుకుంది. సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఈషా రెబ్బా నటించనుంది. కాకపోతే, హీరోయిన్ గా కాదు. విలన్ భార్యగా ఈషా రెబ్బా నటిస్తోంది. ఐతే హీరోయిన్ కి సమాంతరంగా ఈషా రెబ్బా పాత్ర ఉందట.

నిజానికి మొదట ఆ పాత్రలో హీరోయిన్ అంజలి ను తీసుకోవాలనుకున్నారు. కానీ, అంజలి ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో ఇప్పుడు ఈ పాత్రలో ఈషా రెబ్బాని తీసుకున్నారు. మరి ఈషా రెబ్బా కెరీర్ మహేష్ బాబు సినిమాతోనైనా మళ్ళీ పుంజుకుంటోందా ?, అసలుకే, ఈషా రెబ్బాకి చిన్న పాత్రలే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి, ఆమె కెరీర్ కి మహేష్ – త్రివిక్రమ్ సినిమా అత్యంత కీలకం కానుంది.

Also Read:ఉసిరిరసంతో ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -