ఈనాడు రామోజీరావు ఇకలేరు..

17
- Advertisement -

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఇక లేరు. ఇవాళ ఉదయ 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు రామోజీరావు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రామోజీరావు.

ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటికి తరలించారు.

రామోజీరావు పూర్తిపేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్‌ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్రవేశారు.మీడియా రంగంలో రారాజుగా, రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2016లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

Also Read:11న సీఎంగా బాబు ప్రమాణస్వీకారం..

- Advertisement -