ELNINO:ఈ యేడాది సాధారణ వర్షపాతం..!

54
- Advertisement -

2023వ సంవత్సరంకు గాను భారతదేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ యేడాది నైఋతి ఋతుపవనాల వల్ల వర్షాలు సాధారణంగా ఉంటాయని అన్నారు. ఆగస్టు సెప్టెంబర్ ఆక్టోబర్‌ నెల్లో ఎల్‌నినో ప్రభావం చేత వర్షాలు నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎల్‌నినో ప్రభావం జూలై నుంచి ప్రారంభమయ్యి సీజన్‌లో రెండో భాగంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్‌ తెలిపారు.

ఎల్‌నినో అనగా…పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితం వేడిగా మారుతుంది. అందువల్ల భారతదేశానికి రావాల్సిన రుతుపవనాలు అక్కడికి ఆకర్షించడం వల్ల భారతదేశంలో వర్షపాతం తక్కువగా నమోదు అవుతాయి. తద్వారా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండంలో విస్తారంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి అతివృష్టికి కారణమవుతుంది. ఎల్‌నినో ప్రభావం దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాలుగా ఉంటుంది. అయితే ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల కాలం తర్వాత వస్తుంది. దీన్ని ప్రభావం హిందూ మహాసముద్రంలో పడి భారతదేశం, తూర్పు ఆఫ్రికా ఖండమంతటా కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికి చాలా మంది రైతులు వర్షాధారితంగా వ్యవసాయం చేసుకుంటారు. ఎల్‌నినో ప్రభావం వల్ల భారతదేశంలో తక్కువగా వర్షపాతం నమోదువుతుంది.

ఇవి కూడా చదవండి…

KTR:అదానీకి విశాఖ ఉక్కు…తెలుగు ప్రజలకు భారీ నష్టం..!

ఉత్సాహంగా సైక్లోథాన్‌

తాటిపండు..ఔషధ గుణాలు

- Advertisement -