IPL 2023 : ఈసారైనా.. సన్ రైజర్స్ గెలిచేనా ?

63
- Advertisement -

ఐపీఎల్  బ్యాక్ మ్యాచ్ లలో నేడు రెండు ఆసక్తికరమైన మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మద్యాహ్నం 3:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఇక రెండవ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు 7 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి టాప్ 3 లో కొనసాగుతుంది. అటు నైట్ రైడర్స్ 8 మ్యాచ్ లలో 3 విజయాలు సాధించి రేస్ లో కాస్త వెనకబడింది. అయితే గతంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కోల్ కతా దే పై చేయిగా నిలిచింది.

కోల్ కతా విజయంలో రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసం గుజరాత్ అంతా తేలికగా మర్చిపోలేదు. దాంతో ఈసారి కోల్ కతాపై విజయం సాధించి దెబ్బకు దెబ్బ తీయాలని గుజరాత్ పట్టుదలగా ఉంది. ఇక రెండవ మ్యాచ్ లో తలపడే సన్ రైజర్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ప్రస్తుతం అత్యంత ఫెళవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి రెండు జట్లుగా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. గత మ్యాచ్ లో ఢిల్లీ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేక హైదరబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Also Read: IPL 2023:లక్నో తో పంజాబ్.. గెలిచేదెవ్వరు?

దాంతో టిట్ ఫర్ ట్యాట్ గా ఈ మ్యాచ్ లో నైనా ఢిల్లీపై హైదరాబాద్ పై చేయి సాధిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సన్ రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అత్యంత ఫెళవమైన ప్రదర్శన కనబరుస్తూ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. గత సీజన్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ సీజన్ లో కూడా అదే పేళవమైన ప్రదర్శనను కొనసాగిస్తుంది. దాంతో టీం కూర్పు విషయంలో సన్ రైజర్స్ యజమాన్యంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అభిమానులు. ఏదేమైనప్పటికి సన్ రైజర్స్ జట్టు నుంచి వార్నర్ దూరమైనప్పటి నుంచి జట్టు పేళవమైన ప్రదర్శనతో విమర్శలను మూటగట్టుకుంటుంది. మరీ ఇక నుంచి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లు కావడంతో హైదరబాద్ తిరిగి పుంజుకుంటుందేమో చూడాలి.

Also Read: ఎక్కిళ్ళు ఎక్కువైతే.. ఇలా చేయండి !

- Advertisement -