సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`. కావ్యా థాపర్ హీరోయిన్. వి.ఎస్.వ వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సినిమా పెద్ద సక్సెస్ సాధించి రాహుల్ విజయ్ హీరోగా రాణించాలని అన్నారు.
దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ – “మా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలియజేసిన వరుణ్ తేజ్‌కి నా థాంక్స్. ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరిగాయి. రాహుల్ విజయ్ సూపర్బ్ పెర్ఫామర్. దివ్య విజయ్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మణిశర్మ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిట్ వర్క్ సినిమాకు మేజర్ ప్లస్ అవుతాయి. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది“ అన్నారు.
నిర్మాత దివ్యా విజయ్ మాట్లాడుతూ – “పస్ట్‌లుక్‌ను విడుదల చేసిన వరుణ్‌తేజ్‌కి థాంక్స్. ఫస్ట్‌లుక్‌కు మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. అన్నీ అంశాలతో దర్శకుడు రాము సినిమాను చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం“ అన్నారు.
రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేశ్, సత్యం రాజేశ్, జోశ్ రవి, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత: దివ్యా విజయ్, దర్శకత్వం: రాము కొప్పుల.