ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష అనంతరం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫెయిలైన విద్యార్థులు బాధపడకూడదు. ఎలాంటీ అఘాయిత్యలకు పాల్పడవదని ఆయన అన్నారు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్ ను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేస్తామన్నారు. అలాగే పాసయైన విద్యార్థులకు కూడా రీ వెరిఫికేషన్ చేసుకోవచ్చ కాకపోతే వారు ఫీజు చెల్లించాల్సివుంటుంది. ప్రతీ ఏడాది దాదాపు 20 వేల మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్,రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటారు. అయితే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరం అన్నారు. ఇక ఇలాంటి పోరపాట్లు జరకుండా గట్టి చర్యలు తీసుకుటామని.. పిల్లలకి స్కూల్ దశ నుండే అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.