మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం

322
kishan Reddy Mother Died

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గంగాపురం అండాలమ్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. గురువారం ఉదయం 9గంటలకు ఆండాలమ్మ పార్ధివదేహాన్ని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.