అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ

4
- Advertisement -

అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రూ.17 వేల కోట్ల రుణం తీసుకుని మోసగించిన కేసులో అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది ఈడీ. ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇటీవలె అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఏకకాలంలో 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల్లో అనేక కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.మూడు రోజులపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో, అనేక ఆర్థిక లావాదేవీలపై ఆధారాలు వెలుగులోకి వచ్చాయని భావిస్తున్నారు. ఇందులో కొన్ని డాక్యుమెంట్లు విదేశీ లావాదేవీలకు సంబంధించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 జూలైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి విభజన తరువాత ఏర్పడింది. ఆయన రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, మరియు రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి పలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను నడిపారు. అనిల్ అంబానీ నికర ఆస్తి విలువ సుమారుగా 3 బిలియన్.

Also Read:TTD:భక్తులకు టీటీడీ హెచ్చరిక

- Advertisement -