నీరవ్ మోడీ….ఆస్తులు జప్తు

286
nirav modi
- Advertisement -

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆస్తులను జప్తు చేసింది ఈడీ. ఆర్ధిక నేరగాళ్ల చట్టం కింద మోడీకి చెందిన రూ. 329.66 కోట్ల రూపాయలను జప్తు చేసినట్లు తెలిపింది.

ఈడీ జ‌ప్తు చేసిన నీర‌వ్ ఆస్తుల్లో ముంబైలోని వ‌ర్లిలోగ‌ల ఓ భ‌వ‌నంలోని నాలుఉ ఫ్లాట్లు, స‌ముద్ర తీరంలోని ఒక ఫాంహౌజ్‌, అలీబాగ్‌లోని ఖాలీ స్థ‌లం, జైస‌ల్మేర్‌లోని విండ్ మిల్లు, లండ‌న్‌లోని ఒక ఫ్లాట్‌, యూఏఈలోని రెసిడెన్షియ‌ల్ ఫ్లాట్లు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం నీరవ్ యునైటెడ్ కింగ్ డ‌మ్‌లోని జైల్లో ఉన్నాడు.

నీరవ్ మోడీ భారత బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు.2018 జులైలో నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -