లిక్కర్ కేసులో కింగ్‌పిన్ కేజ్రీనే:ఈడీ

21
- Advertisement -

లిక్కర్ కేసులో కింగ్ పిన్ కేజ్రీవాల్ అని న్యాయస్థానానికి వెల్లడించింది ఈడీ. ఈడీ తరపున ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. ఇది కేవలం రూ.100 కోట్లకు సంబంధించిన కేసు కాదని హవాలా రూపంలో డబ్బు చేతులు మారాయన్నారు. కేజ్రీవాల్‌ని 10 రోజుల కస్టడీకి అప్పగించాలన్నారు. ఇక కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపించారు.

28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది ఈడీ. లిక్కర్ కుంభకోణంలో వచ్చిన డబ్బును గోవా ఎన్నికల్లో ఉపయోగించారని తెలిపింది ఈడీ.రూ.45 కోట్లు హవాలా ద్వారా డబ్బులు నాలుగు రూట్లలో పంపారని తెలిపింది.విజయ్ నాయర్ కంపెనీ నుండి అన్ని ఆధారాలు సేకరించామని తెలిపింది. అయితే ఈడీ వాదనను తోసిపుచ్చారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది.

కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో తెలపాలన్నారు. ఇక తనతో కలిసి పనిచేసిన వ్యక్తి లిక్కర్ స్కాంలో దొరకడంపై స్పందించారు సామాజిక కార్యకర్త అన్నా హాజారే. కేజ్రీవాల్‌ మద్యం కుంభకోణంలో ఉండటం బాధాకరమన్నారు.

Also Read:వేసవిలో నోరు పొడిబారితే.. ఇలా చేయండి!

- Advertisement -