దేశ వ్యాప్తంగా అప్పుడే వినాయక చవితి సందడి మొదలైంది. లంబోదరుడి మండపాల ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇక ప్రతి ఏడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది సైతం మట్టి గణపతులకు మరింత ఆదరణ లభిస్తోంది.మట్టి, గడ్డి, జనప నార, వెదురు పుల్లల వంటి సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించి విద్యార్థులు వినాయక విగ్రహాల వల్ల ఎలాంటి నష్టం ఉండదు.పర్యావరణానికి కూడా హాని కలగకపోవడంతో ఏడాదికేడాది మట్టి గణపతి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వాలు, మీడియా, స్వచ్ఛందసంస్థలు గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలను వాడే సంస్కృతి బాగానే పెరిగింది.
మట్టి వినాయకులపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేశ్ స్టాళ్లను మంత్రి ప్రారంభించారు. శిల్ప కళా వేదికలో 14 స్టాళ్లను జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. కాలుష్యానికి దూరంగా ఆది దేవుడి పండుగ జరుపుకుందామని పిలుపినిచ్చారు కేటీఆర్.ఒక్క హైదరాబాద్ లోనే 2 లక్షల కు పైగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో గతంలో ఎన్నో చెరువులు, కొలనులు ఉండేవన్నారు. మార్పు అనేది చిన్నప్పుడే మొదలవ్వాలన్నారు. హైదరాబాద్ మహా నగర జనాభా కోటి దాటిందని చెప్పారు. కాలుష్య నివారణ కోసం 25 గణేశ్ నిమజ్జన ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన తెలియజేశారు. మట్టి గణపతి విగ్రహాలను జీహెచ్ఎంసీ పంపిణీ చేస్తున్నదన్నారు.