- Advertisement -
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికలసంఘానికి సమర్పించకపోవడంతో ఈసీ అనర్హత వేటు వేసింది.
మూడేళ్లపాటు పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభకు, శాసనమండలికి పోటీచేసే అర్హతను బలరాం నాయక్ కోల్పోయినట్లు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావుపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.
- Advertisement -