దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడు, పుదుచ్చేరి,కేరళ, అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా.. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
అయితే దేశంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో నమోదవుతున్నా ఎన్నికల సంఘం అలసత్వంగా వ్యహరించిందని మండిపడింది మద్రాస్ హైకోర్టు. ర్యాలీలు, రోడ్‌షోల్లో ఆంక్షల అమలులో పూర్తిగా విఫలమైందని, కరోనా సెకండ్ వేవ్‌కు ఏకైక కారణం ఈసీ మండిపడింది. ఎన్నికల సంఘం సరైన ప్రణాళికలు అమలు చేయకపోతే మే 2వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించింది.