జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్‌ షెడ్యూల్ ఇదే..

240
MPTC Election Schedule
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. స్థానిక సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు రాష్ట్ర ఎలక్షన్‌ కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.

తొలి దశ పోలింగ్‌కు ఈనెల 22న, రెండో దశకు ఈనెల 26న, మూడో దశకు ఈనెల 30న నోటీసులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. తొలి విడత మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. మే 27న తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇక జడ్పీటీసీ అభ్యర్థులు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.లక్షా 50వేలు గరిష్ఠ వ్యయ పరిమితి విధిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఎన్నికల నిర్వహణకు 32,042 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.

- Advertisement -