ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల..

57

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10న జరిగే తొలిదశ పోలింగ్ తో ఎన్నికలు షురూ అవుతాయి. ఫిబ్రవరి 14న రెండో దశ, ఫిబ్రవరి 20న మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ పోలింగ్ జరగనుంది.

403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్ లో ఫిబ్రవరి 23, మార్చి 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది. కాగా, తొలిదశ ఎన్నికల కోసం జనవరి 14న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 21. జనవరి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి 27. ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది.

UP & 4 other states Polls:
Phase 1: Feb 10
Phase 2: Feb 14 (Punjab, UK, Goa)
Phase 3: Feb 20
Phase 4: Feb 23
Phase 5: Feb 27 (Manipur)
Phase 6: March 3 (Manipur)
Phase 7: March 7

ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లు పెరిగారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్‌ సేఫ్‌ ఎన్నికలు నిర్వహిస్తాం. ఐదురాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించాం. కరోనా పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపామని తెలిపారు.

60 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పిస్తున్నాం. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితి రూ. 28 లక్షలు, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో రూ. 40 లక్షలుగా నిర్ణయించాం. డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతుల రవాణా జరగకుండా చూడాలని అన్ని సంస్థలనూ ఆదేశించాం. ఈసీ ప్రత్యేక యాప్ ద్వారా ఉల్లంఘనలు, అక్రమాలను ఎవరైనా సరే నేరుగా రిపోర్ట్ చేయవచ్చు.అన్నారు.

కోవిడ్-19 ప్రొటోకాల్ – మార్గదర్శకాలు:

-నమ్మకం ఉంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది
-ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారే ఉండాలి
-అర్హత కల్గిన సిబ్బందికి ప్రికాషనరీ డోసు కూడా అందించాలి
-ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించాం
-గోవా జనాభా దాదాపు అందరూ 2 డోసులు తీసుకున్నారు
-ఉత్తరాఖండ్‌లోనూ భారీ సంఖ్యలో డోసుల పంపిణీ జరిగింది
-వైద్య నిపుణులు, కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయాలను తీసుకుంటున్నాం
-ప్రతి నియోజకవర్గం స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమకం.
-అభ్యర్థులు నేరుగా కలిసి చేసే ప్రచారం కంటే డిజిటల్ పద్ధతుల్లో ప్రచారం చేసుకోవాలి.
-రోడ్ షో, పాదయాత్ర, బహిరంగ సభలకు అనుమతి లేదు. జనవరి 15 వరకు ఈ ఆంక్షలు ఉంటాయి.
-రాత్రి గం. 8.00 నుంచి ఉదయం గం. 8.00 వరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదు
-ఇంటింటికీ వెళ్లి చేసే ప్రచారంలో ఐదుగురికి మించి ఉండరాదు
-ఉల్లంఘనలకు పాల్పడేవారిపై ఐపీసీతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు.