ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక

261
EC announce schedule of vp
- Advertisement -

ఉపరాష్ర్టాపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జులై 4న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని అదే రోజు నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు.  జులై 19న అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఆగస్టు 10 తేదీతో ముగియనుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో 790 మంది సభ్యులు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారి నసీం జైదీ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారని తెలిపారు.

రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్న ఎన్డీయే, ఉపరాష్ట్రపతి పదవికి ప్రస్తుత మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -