పోస్టల్ బ్యాలెట్…కేంద్రం కీలకనిర్ణయం

269
ec
- Advertisement -

పోస్టల్ బ్యాలెట్‌పై కేంద్రం కీలక,చారిత్రాక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు చేస్తూ 65 సంవత్సరాలు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

దీంతో కరోనా పాజిటివ్ వచ్చినవారు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతిచ్చింది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని….1961 ఎన్నికల నిబంధనల చట్టంలోని ఆర్టికల్ 27ఎ లో ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు న్యాయశాఖ వెల్లడించింది.

ఈ అక్టోబర్‌లో బిహార్‌లో వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు 80 ఏళ్ల పైబడిన వారు,అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పటినుండి 65 ఏళ్లు పైబడిన వారు కూడా పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయనున్నారు.

- Advertisement -