మోడీ ప్రసంగంపై అభ్యంతరం..ఈసీకి ఫిర్యాదులు

22
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగంపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ ఒక‌వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు పంచి పెడుతుందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగగా ప‌లు పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్నామని తెలిపింది.కాంగ్రెస్, సీపీఎం…ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

మోడీ వ్యాఖ్య‌లు విద్వేష‌పూరితంగా, ఓ మ‌తాన్ని టార్గెట్ చేస్తున్న‌ట్లుగా ఉన్నాయ‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఫిర్యాదును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌ధానిపై ఈసీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీఎం డిమాండ్ చేసింది.

Also Read:KTR:బడే భాయ్..చోటా భాయ్..ఇద్దరు మోసగాళ్లే

- Advertisement -