ఈటల కబ్జా భూములపై నివేదిక..

160
etala
- Advertisement -

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామ శివార్లలో 1994లో తమకు కేటాయించిన అసైన్ లాండ్స్ ను తమ వద్ద నుంచి బలవంతంగా ఆక్రమించినారని, ఈటల రాజేందర్ కు చెందిన జమునా హాచరీస్ పై వచ్చిన ఫిర్యాదుల మీద మెదక్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తు నివేదిక ప్రకటించారు.

ఇందులో దర్యాప్తు అనంతరం తేలిన వాస్తవాలు..

1.మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో మరియు విజిలెన్స్ శాఖ ఎంక్వేరీలో.. ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు ఇచ్చిన సుమారు 66.01 ఎకరాల అసైన్మెంట్ భూములను జమున హాచరీస్ వారు కబ్జాచేశారని తేలింది. 2. అసెన్ లాండ్ గుండా రోడ్డు వేసారు. ఆక్రమంలో.. ఫారెస్టు కన్సర్వేషన్ యాక్టు మరియు వాల్టా చట్టానికి విరుద్దంగా.. చెట్లను నరికివేసారని మెదక్ జిల్లా డిస్టిక్ ఫారెస్టు అధికారులు ఎంక్వేరీలో తేల్చారు.
3.వ్యవసాయ భూమిలో నాలా చట్టానికి విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారని నివేదకలో పేర్కొన్నారు.

- Advertisement -