- Advertisement -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గుర్తించారు.
భూకంపం కారణంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 20 మంది మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

