మయన్మార్‌లో భూకంపం..

10
- Advertisement -

మయన్మార్‌లో భూకంపం సంభవించింది. ఈ రోజు(మంగళవారం) తెల్లవారుజామున సంభవించింది భూకంపం. రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది భూకంప తీవ్రత. భారత్‌లోని మణిపూర్, నాగాలాండ్, అస్సాంలోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం.

ఉదయం 4:28 గంటలకు (IST) టిబెట్‌లో 3.3 తీవ్రత గల కంపనం నమోదైంది. ఇది భూమి ఉపరితలానికి 10 కి.మీ లోతులో సంభవించింది. దీని కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగిన్‌కు 227 కి.మీ ఉత్తరాన, అసోంలో దిబ్రూఘఢ్‌కు 303 కి.మీ ఉత్తరాన ఉన్నది. మరోవైపు ఉదయం 6:10 గంటలకు (IST) మణిపూర్‌లోని ఉఖ్రుల్ సమీపంలో భూమికి 15 కి.మీ లోతులో భూకంపం సంభవించింది.

నాగాలాండ్, మిజోరాం పక్కప్రాంతాల్లో కూడా స్వల్ప స్థాయిలో కంపనలు నమోదయ్యాయి. అదే రోజు మహారాష్ట్ర, టిబెట్‌లలో కూడా స్వల్ప భూకంపాలు సంభవించాయి. అలాగే ఉదయం 4:28 గంటలకు (IST) టిబెట్‌లో 3.3 తీవ్రత గల భూకంపం సంభవించింది. ఇది భూమికి 10 కి.మీ లోతులో, అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగిన్‌కు 227 కి.మీ ఉత్తరాన, అసోంలో దిబ్రూఘఢ్‌కు 303 కి.మీ ఉత్తరాన జరిగింది.

మయన్మార్‌లో ఈ భూకంపం సెప్టెంబర్ 27న జరిగిన మరొక ఘటన తరువాత సంభవించింది. ఆ రోజు బంగ్లాదేశ్‌లో 3.5 తీవ్రత గల భూకంపం నమోదైంది. దీని కేంద్రం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు ఈశాన్యంగా 89 కి.మీ దూరంలో ఉంది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్ప కంపనలు అనుభవించబడ్డాయి.

Also Read:మంత్రి లోకేశ్‌కు తిలక్ వర్మ గిఫ్ట్

- Advertisement -