తైవాన్‌లో శనివారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ (సీడబ్ల్యూఏ) వెల్లడించింది. భూకంప కేంద్రం భూభాగానికి సమీపంలోనే ఉండటంతో పలుచోట్ల భవనాలు తీవ్రంగా కంపించాయి. అర్థరాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంప ప్రభావంతో కొద్ది సేపు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సీడబ్ల్యూఏ స్పష్టం చేసింది. పెద్దఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించలేదని తెలిపింది. అయినప్పటికీ ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
తైవాన్ భూకంపాలకు లోనయ్యే ప్రాంతంగా ప్రసిద్ధి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలో కూడా తైవాన్‌లో తీవ్ర భూకంపాలు సంభవించి భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర సహాయక బృందాలను అప్రమత్తం చేసింది. భవనాల భద్రతపై అధికారులు సమీక్ష చేపట్టారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది.
Also Read:అంతర్జాతీయ ఇన్నోవేషన్ సమ్మిట్‌కు కేటీఆర్

