- Advertisement -
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. సముద్రంలో భూకంపం రావడంతో భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో సునామీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ భూకంపం వల్ల న్యూజిలాండ్‌కు ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ పేర్కొంది.
గత నెల 15న న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రాజధాని వెల్లింగ్టన్ సమీపంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. పరంపరౌము నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -