మయాన్మార్‌లో భారీ భూకంపం

10
- Advertisement -

మయాన్మార్, బ్యాంకాక్ లలో భారీ భూకంపం సంభవించింది. రికర్ట్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదుకాగా సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలో మీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది.

పలు దఫాలుగా ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మాఆయి.

ఇక బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. భారీ భూకంపం కారణంగా భవనాలు కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Also Read:సౌ’భాగ్యనగరం’… అ’భాగ్యనగరం’గా: కేటీఆర్

- Advertisement -