నేపాల్‌లో మళ్లీ భూకంపం..

211
EARTH QUAKE HITS NEPAL AGAIN
EARTH QUAKE HITS NEPAL AGAIN
- Advertisement -

గతేడాది ఏప్రిల్ 25న నేపాల్లో భూకంపం సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు.. భూకంప తీవ్రత కారణంగా నేపాల్ దేశమంతా అతులాకుతలమైన సంగతి తెలిసిందే. నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ తెల్ల‌వారుజామున రిక్ట‌ర్ స్కేలుపై దాని తీవ్రత 5.5గా న‌మోదైంది. ఉద‌యం 5.05 గంట‌ల‌కు భూమికి ప‌ది కిలోమీట‌ర్ల లోతున భూకంపం సంభ‌వించిన‌ట్టు నేపాల్ సిస్మోల‌జీ కేంద్రం, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్ర‌క‌టించాయి. క‌ఠ్మాండుకు 150 కిలోమీట‌ర్ల దూరంలోని సోలుకుంబు జిల్లాలోని ఎవ‌రెస్ట్ ప్రాంతంలో భూకంపం సంభ‌వించిన‌ట్టు తెలిపాయి. భూకంపంతో ఇళ్లు కుదుపున‌కు గుర‌వ‌డంతో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రుగులు తీశారు.

భూకంపం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి స‌మాచారం లేదు. ఇప్పటివరకూ 4 కంటే ఎక్కువ భూకంప తీవ్రతతో భూమి కంపించడం ఇది 475వ సారి. కాగా, సోమవారం సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. గతేడాది ఏప్రిల్ 25న నేపాల్లో సంభవించిన భూకంపంలో తొమ్మిది వేల మంది మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -