- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అర్థరాత్రి 2.30 గంటలకు భూకంపం వచ్చింది. 8 సెకండ్లపాటూ భూమి కంపించింది. కరీంనగర్‌లో అర్ధరాత్రి 2:40 గంటలకు స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.7గా నమోదైంది. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు పరుగులు తీశారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. హుజుర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్ల చెరువుతో పాటు పలు మండలాల్లో 12 సెకన్ల పాటు భూమి కంపించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.
- Advertisement -