- Advertisement -
భారత్, నేపాల్ సరిహద్దుల్లో మరోసారి భూ కంపం సంభవించింది. ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్ సమీపంలో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఉదయం గం.6.27నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. అర్ధరాత్రి దాటాక పలు చోట్ల 20 సెకన్లపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించగా భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -