- Advertisement -
మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.56 గంటలకు యాంగాన్‌లో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదయింది. యాంగాన్‌కు 260 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
శనివారం తెల్లవారుజామున ఇరాన్‌లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఐదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు.
- Advertisement -