అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకుని స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించాయి. సుమారు 8 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపానికి కేంద్రం Koraput ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. భూకంపం ఉదయం సుమారు 11:31 గంటలకు సంభవించినట్లు National Center for Seismology వెల్లడించింది.
Also Read:అభినయ కృష్ణ.. ‘సఖీ’ సాంగ్
భూమి అకస్మాత్తుగా కంపించడంతో అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్ది సెకండ్లపాటు మాత్రమే ప్రకంపనలు కొనసాగినా, భయంతో కొంతసేపు బయటే గడిపారు.ప్రస్తుతం వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా, తక్కువ తీవ్రత గల భూకంపమే అయినప్పటికీ, అల్లూరి జిల్లాలో ప్రజలను క్షణాల్లో భయానికి గురిచేసింది.

