SSLV-D3:ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రత్యేకతలివే

5
- Advertisement -

ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుండి చేపట్టిన SSLV-D3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపట్టిన రాకెట్‌ ప్రయోగమిది.

ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.

పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుందని ఇస్రో వెల్లడించింది.

Also Read:KTR: అక్క‌చెల్లెమ్మ‌ల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం లేదు

- Advertisement -