తెలంగాణలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. సిఎం కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని ఇలా రకరకాల వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికలపై సిఎం కేసిఆర్ మరియు మంత్రి కేటిఆర్ ఇప్పటికే పలు మార్లు స్పస్టతనిచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికి ఏదో ఒక సందర్భంలో ముందస్తు ఎన్నికల టాపిక్ తరచూ తెరపైకి వస్తూనే ఉంది.
Also Read: ప్రతిపక్షాలపై హరీశ్‌రావు ఫైర్…
తాజాగా ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటిస్తుండడంతో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించే విధంగా అధికారులు సిద్దమౌతున్నారని, ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇదే గనుక నిజం అయితే అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలు నిజమా కదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు అధికార బిఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న వార్తాలు అవాస్తవం అని కొందరు కొట్టి పారేస్తున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి ఆల్రెడీ వచ్చేశాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దమే అనే సంకేతాలను ఇస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: బీజేపీ సర్వనాశనం.. కారణమదే ?