అఖిల్ కు హిట్ ఇచ్చేదెవ్వరు..?

32
- Advertisement -

అక్కినేని అఖిల్ సినిమాల్లోకి రాక ముందు ఆయన ఎంట్రీ కోసం ఏ స్థాయిలో వెయిటింగ్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అఖిల్ కటౌట్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని, అక్కినేని ఫ్యామిలీలో అసలైన మాస్ హీరో అవుతాడని.. ఇలా అఖిల్ గురించి నడిచిన చర్చ అంతా ఇంత కాదు. తీర భారీ అంచనాల మధ్య ” అఖిల్ ” మూవీతో ఎంట్రీ ఇచ్చిన అయ్యగారు మొదటి సినిమాతోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తరువాత కూడా అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతూనే వచ్చే మధ్యలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తో యావరేజ్ హిట్ అందుకున్నప్పటికి, అది అఖిల్ ఇమేజ్ ను ఏమాత్రం పెంచేది కాదు. .

ఇక ఈ ఏడాది భారీ హైప్ తో విడుదల అయిన ” ఏజెంట్ ” గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏజెంట్ ఇచ్చిన డిజాస్టర్ అఖిల్ ఇమేజ్ ను కూడా డైలమాలో పడేసింది. దాంతో అఖిల్ నటించే నెక్స్ట్ సినిమాపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. కాగా అఖిల్ తన తరువాతి సినిమాను ఓ కొత్త డైరెక్టర్ తో చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడి కథకి అఖిల్ ఒకే చెప్పినట్లు సమాచారం.

Also Read: నేడు 3 సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్

ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా రూపొందబోతుందట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు టాక్. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీస్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి అందుకే ఆడియన్స్ అభిరుచిని దృష్టిలో పెట్టుకొని అఖిల్ ఈ పీరియాడిక్ డ్రామాకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఒక్క హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అక్కినేని హీరో కు ఈ దర్శకుడైనా అదిరిపోయే హిట్ ఇస్తాడేమో చూడాలి.

Also Read: విడాకులపై స్టార్ హీరోయిన్ క్లారిటీ

- Advertisement -