దర్శకుడు వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ ‘వారసుడు’ అని ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా అని హడావిడి జరుగుతుంది. దీనికితోడు వంశీ పైడిపల్లి పనితనం పై మంచి నమ్మకం ఉంది. ఫీల్, సెన్స్ ఉన్న ఎమోషనల్ దర్శకుడు వంశీ పైడిపల్లి. నిజంగా మనసు పెట్టి పనిచేస్తే… మనసును మెలిపెట్టే సినిమా తీయగలడు. బృందావనం, మహర్షి చిత్రాల రూపంలో ఇప్పటికే ఈ విషయాన్ని వంశీ పైడిపల్లి ఘనంగా నిరూపించాడు కూడా. కానీ, వంశీ పైడిపల్లి కు ఒక సమస్య ఉంది. తాను మనసు పడి రాసుకున్న స్క్రిప్ట్ లో మరొకరు వచ్చి కెలికితే.. ఇక వెంటనే వంశీ పైడిపల్లి మనసు విరిగిపోతుంది. ఇలాంటి సమయంలో మనసైతే మల్లి, లేకపోతే ఎల్లి అన్నట్లు ఉంటుంది వంశీ పైడిపల్లి తీరు.
ప్రస్తుతం తన సీన్స్ లో హీరో విజయ్ ప్రమేయం.. వంశీ పైడిపల్లిను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందట. కమర్షియల్ కథలను ఎంచుకుని పక్కా హీరోయిజాన్ని ప్రదర్శించే విజయ్ కి, ఎమోషనల్ ఇన్ వాల్వ్ మెంట్ ఉన్న స్టోరీలు అల్లుకునే వంశీ పైడిపల్లి కు సరిగ్గా సింక్ అవ్వడం లేదని టాక్. పైగా వంశీ పైడిపల్లి మితిమీరిన ఓవర్ యాక్షన్ వంటి వాటికీ వ్యతిరేకం. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. అలాంటి వాటికీ విజయ్ ఎప్పుడు ముందు ఉంటాడు. పైగా తమిళ జనాలకు అవి బాగా కావాలి. సహజంగానే ఆరవ అభిమానులు తమ హీరో పాత్ర పైనే బోలెడన్నీ హోప్స్ పెట్టుకుంటారు.
ఈ హోప్స్ విషయంలోనే విజయ్ కి బోలెడన్నీ అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా తన పాత్ర తమిళ వాళ్లకు కనెక్ట్ అవుతుందా ? అనే అయోమయంలో ఉన్నాడు. మా వాళ్లకు ఇదొక గందరగోళం కేరక్టర్ అని విజయ్, వంశీ పైడిపల్లి తోనే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడట. నిజానికి వంశీ పైడిపల్లి లో ఓ మంచి సుగుణం ఉంది, స్టార్ హీరోలతో ఆయనకు మంచి సంబంధాలుంటాయి. కానీ, ఎందుకో విజయ్ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం ఈ ‘వారసుడు’ సంక్రాంతి విడుదల పై వివాదం నడుస్తోంది. మరి చివరకు ఈ ‘వారసుడు’ మజిలీ ఎటువైపు మళ్లుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..