దసరా పండుగ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ సిద్ధమయ్యాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. ఆకర్షణీయమైన ఆఫర్లతో దసరా ఫెస్టివల్ ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది.
ఫ్లిప్ కార్ట్ నేటి నుంచి ఈ నెల 14 వరకు వివిధ రకాల ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ దగ్గరి నుంచి ఫ్రిజ్,వాషింగ్ మిషన్, అనేక రకాల ఇతర ప్రొడక్ట్స్‌పై కూడా ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్నది. అంతేగాదు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు.
అర్థరాత్రి నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ని ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ తదితర అనేక రకాల ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు. కాగా ఈ ఆఫర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. కెమెరాలపై 35 శాతం, హెడ్‌ఫోన్స్‌పై 60 శాతం, స్పీకర్లపై 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.
ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా అనేక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఫేక్ వెబ్ సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారీ డిస్కౌంట్లను చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు