డంకీ… ఫస్ట్ లుక్

27
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, హృద‌యాల‌కు హ‌త్తుకునే ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ రూపొందించే ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘డంకీ’. ఈ సినిమా నుంచి డంకీ డ్రాప్ 1 రీసెంట్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీనికి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. డంకీ డ్రాప్ 1 విడుద‌లైన 24 గంట‌ల్లో ఏకంగా 72 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. కోట్లాది మంది ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను డంకీ డ్రాప్ 1 హ‌త్తుకుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. నలుగురు స్నేహితుల‌కు సంబంధించిన ఓ ఆక‌ట్టుకునే ప్ర‌పంచానికి రాజ్ కుమార్ హిరాణి ఇందులో సింపుల్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ న‌లుగురు యువ‌కులు విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ప్రేమ‌, స్నేహం క‌ల‌యిక‌గా డంకీ సినిమాను రాజ్‌కుమార్ హిరాణి రూపొందించిన‌ట్లు తెలుస్తుంది. ఇది మ‌న‌లోని భావోద్వేగాల‌ను తాకుతూ చ‌క్క‌గా న‌వ్వుకునేలా, హృద‌యం ఆక‌ట్టుకునే స‌మాధానాలను అందిస్తుంది.

షారూఖ్ ఖాన్ చార్మింగ్ లుక్‌, రాజ్ కుమార్ హిరాణి టేకింగ్‌ల‌తో పాటు సోనూ నిగ‌మ్ అద్భుత‌మైన మ్యూజిక‌ల్ వాయిస్‌ల‌తో డంకీ డ్రాప్ 1 సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచింది. ఇది క‌చ్చితంగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంటుంద‌ని డంకీ డ్రాప్ 1 చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

హృద్య‌మైన భావాల‌ను అందంగా చూపిస్తూ రాజ్‌కుమార్ హిరాణి ఈ సినిమాను రూపొందించారు. చ‌క్క‌టి పాత్ర‌లను ఆయ‌న ఆవిష్క‌రించిన తీరు ప్రేక్ష‌కుల‌కు ఓ రోల‌ర్ కోస్ట‌ర్‌లా అనిపిస్తుంది. షారూఖ్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రం బోమ‌న్ ఇరాని, తాప్సీ ప‌న్ను, విక్కీ కౌశ‌ల్‌, విక్ర‌మ్ కొచ్చ‌ర్‌, అనీల్ గ్రోవ‌ర్ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌వుతుంది.

Also Read:భూకంపంతో నేపాల్ విలవిల..

- Advertisement -