పెరిగిన ‘డంకీ’ బుకింగ్స్

37
- Advertisement -

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను హృదయాలను డంకీ చిత్రం గెలుచుకుంటోంది. ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఫీల్ గుడ్ ఎంటర్ టైనింగ్, ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు కంటే శుక్ర, శని వారాల్లో అత్యద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ఆ రెండు రోజుల్లో సినిమాకు 40 నుంచి 50 శాతం బుకింగ్స్ పెరగటమే ఉదాహరణ అని చెప్పొచ్చు. అందుకు కారణం స్ట్రాంగ్ మౌత్ టాక్, ఫీల్ గుడ్ కంటెంట్ కారణంగా ఈ హాలీడే సీజన్ లో ప్రేక్షకులందరూ తమ కుటుంబాలతో కలిసి చూడటానికి డంకీనే మొదటి చాయిస్ గా ఎంపిక చేసుకుంటున్నారు.

మన దేశంలోనే కాకుండా ఓవర్ సీస్‌లోనూ ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది. శుక్రవారం కంటే శనివారం 40 నుంచి 50 శాతం బుకింగ్స్ పెరగటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. నాన్ యాక్షన్ జోనర్ మూవీకి ఈ రేంజ్ బుకింగ్స్ రావటం నిజంగా అభినందనీయమని అందరూ అంటున్నారు.

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజైంది.

Also Read:నెలసరి సమస్యలకు..పరిష్కారం!

- Advertisement -