- Advertisement -
రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డంకీ. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే రిలీజైన డ్రాప్ 1, డ్రాప్ 2 లకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా డ్రాప్ 3 రిలీజైంది. షారుఖ్ తన స్నేహితులతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లాలనే లక్ష్యం పెట్టుకుంటారు. కానీ వీసా రాకపోవడంతో ఇల్లీగల్ గా ఇంగ్లాండ్ బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో షారుఖ్ తన స్నేహితుల ప్రాణాలను సైతం పోగుట్టుకుంటారు. ఆ ప్రయాణం, వారి స్నేహంలోని ఎమోషన్‌ని తెలిపేలా ఈ సెకండ్ సాంగ్ ఉంది. తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, మరో ఇద్దరు బాలీవుడ్ నటులు షారుఖ్ స్నేహితులుగా నటిస్తున్నారు.
- Advertisement -