అదే నా జీవిత ఆశయం: దుల్కర్

90
- Advertisement -

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా వెండి తెరకు పరిచయమైన నటుడు దుల్కర్ సల్మాన్‌. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న దుల్కర్‌…తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సీతారామం హిట్ ఎంతో జోష్ ఇచ్చిందని తెలిపారు. ఇక తన జీవిత ఆశయం మమ్ముట్టితో నటించాలనేదే అని తెలిపారు. ఇప్పటివరకు ఆయనతో నటించే ఛాన్స్ రాలేదని తెలిపారు. ప్రస్తుతం దుల్కర్ నటించిన హిందీ మూవీ చుప్ విడుదలకు సిద్దంగా ఉంది.

మలయాళ మెగాస్టార్‌గా మమ్ముట్టి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. కే విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతికిరణంతో ఆల్‌టైం హిట్ కొట్టిన మమ్ముట్టి రీసెంట్‌గా వైఎస్‌ఆర్‌ బయోపిక్‌తో ప్రేక్షకులను మెప్పించారు.

- Advertisement -