ప్రాజెక్ట్ ‘కె’లో యంగ్ సైంటిస్ట్

55
- Advertisement -

నేషనల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా, మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె.’ వైజ‌యంతీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో దీపికా ప‌దుకొణె, అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ క్యామియో రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే మహానటి సినిమాలో దుల్కర్ ను జెమిని గణేషన్ పాత్రలో చూపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ యంగ్ సైంటిస్ట్ గా చూపించబోతున్నాడు.

ఇక ఈ ‘ప్రాజెక్ట్ K’ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ అయిపోయిందని.. ఆ ఫస్ట్ పార్ట్ నే వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారు. రెండో పార్ట్ ను 2025 లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే… నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించడానికి నాగ్ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట.

మరి ఆ నేపథ్యం ఏమిటో చూడాలి. ఐతే పక్కా సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్ ఉంది. అందుకే, ఈ ‘ప్రాజెక్ట్ కె’ కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే పర్యవేక్షకుడిగా పెట్టుకున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ చాలా బాగుంటాయట. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -