దుబ్బాక పోలింగ్.. 82.61 శాతం నమోదు..

186
elections
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 81.44 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్యూలైన్ల‌లో ఉన్న వారికి ఓటేసేందుకు అధికారులు అనుమ‌తి ఇచ్చారు. దీంతో మొత్తం ఓటింగ్‌ శాతం 82.61 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 23 మంది అభ్య‌ర్థులు ఈ ఉప ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు 10వ తేదీన వెల్లడికానున్నాయి.

- Advertisement -