తాగిన మత్తులో ఏం చేశాడో తెలిస్తే.. మీరు షాక్…

205
- Advertisement -

తాగిన మైకంలో కొందరు ఏం చేస్తుంటారో వాళ్లకే తెలియదు. మత్తు దిగాక కానీ వాళ్లు చేసిన తప్పు తెలియదు. అలాంటి సంఘన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ  వ్యక్తి తాగిన మైకంలో మరో వ్యక్తి చెవిని కొరికి మింగేశాడు. వినడానికే ఇబ్బందిగా ఉన్నా.. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్ పురిలో నిన్న రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిత్తేందర్ కుమార్(28) అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంచూ వెళ్తున్నాడు.

Drunken man bites off another’s ear in fight In Delhi

అలా వెళ్తున్న జిత్తేందర్ కి కొద్ది సమయం తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసి మాటలు కలిపారు. మాట.. మాట పోయి ఆ వ్యక్తులు జిత్తేందర్ తో గొడవకు దిగి, దాడి చేశారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తి జిత్తేందర్ ని కింద పడేయగా.. మరో వ్యక్తి జిత్తేందర్ చెవిని కొరికేసి.. ఆమాంతం మింగేశాడు. నొప్పితో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఇద్దరు నిందితులను పోలీసులకు అప్పగించి, జిత్తేందర్ ని ఆస్పత్రి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇద్దరు నిందితులు సంతోష్, దీపక్ లుగా గుర్తించారు. జిత్తేందర్ కి ఈ వ్యక్తులకు ఎటువంటి పరిచయం లేదని పోలీసులు తెలిపారు. తాగిన మైకంలో గొడవకు దిగారని చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఎటువంటి ప్రమాదం లేదని త్వరలో కోలుకుంటారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -