మ‌హాన‌టిలో మ‌ధుర‌వాణి మేకింగ్ వీడియో..

244
samatha paly madhuravani role in mahanati movie and making video is out
- Advertisement -

ఇటివ‌లే విడుద‌లై ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆధ‌ర‌ణ ల‌భించిన సినిమా మ‌హాన‌టి. అల‌నాటి అందాల తార సావిత్రి జివిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈసినిమా బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హాన‌టి సినిమాకు ప్ర‌శంస‌లు అందుతున్నాయి. తెలుగు ఇండ‌స్ట్రీలో మొట్ట‌మొద‌టి బ‌యోపిక్ గా చ‌రిత్ర సృష్టించింది మ‌హాన‌టి. ఈచిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌హాన‌టి సినిమాలో స‌మంత మ‌ధురవాణి అనే జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ను పోషించింది. ఈ పాత్ర ద్వారానే సావిత్రి జీవిత చ‌రిత్ర మొద‌ల‌వుతుంది.

samatha paly madhuravani role in mahanati movie and making video is out

1980వ సంవ‌త్స‌రం నాటి వేష‌ధార‌ణ‌లో మ‌ధుర‌వాణిగా స‌మంత న‌టించిది. స‌మంత న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల నుంచి ప్రశంస‌లు అందుకుంది. ఇంత‌వ‌ర‌కూ సమంత చేసిన విభిన్న పాత్ర‌లో మ‌ధుర‌వాణి ఒక‌టి అని చెప్పుకోవ‌చ్చు. ఈసంద‌ర్భంగా స‌మంత మ‌ధుర‌వాణి క్యారెక్ట‌ర్ లో చేసిన మేకింగ్ వీడియో ఒక‌టి విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. ఈసీన్ల‌లో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్లో ఉన్న సీన్స్ ను విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈవీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. వివిధ‌మైన వేష‌ధార‌ణ‌లో స‌మంత ఈవిడియోలో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హాన‌టి సినిమాకు ప్ర‌శంస‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -