మద్యం మత్తులో చేసిన సరదా పని ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఇద్దరు యువకులు పీకల దాక మద్యం తాగి రెండు వేల అడుగుల లోతు ఉన్న ఓ లోయలోకి దూకేశారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంబోలి ఘాట్ వద్ద ఆగస్టు 1న జరిగింది.
వివరాల్లోకి వెళ్తె….అంబోలీఘాట్ ప్రముఖ పిక్నిక్ స్పాట్ అన్న విషయం తెలిసిందే. ఏడుగురు స్నేహితులు విహార యాత్ర కోసం అక్కడికి వెళ్లారు. అందులో ఇద్దరు మద్యం అతిగా సేవించి అక్కడ ఉన్న బ్రిడ్జి రెయిలింగ్‌ను ఎక్కి విన్యాసం చేయబోయారు. మద్యం మత్తులో ఉన్న వారికి అది ప్రమాదం అని తెలియలేదు. ఇదంతా చూస్తున్న స్నేహితులు వారిని ఆపే ప్రయత్నం చేయకుండా వీడియో తీస్తూ కేరింతలు కొడుతు వారికి ఇంకాస్తా హుషారునిచ్చారు.
అంతే క్షణాల్లో వారు జారి 2000 అడుగుల లోయలో కింద పడి చనిపోయారు. మృతులను ఇమ్రాన్ గరాడి (26), ప్రతాప్ రాథోడ్(21)గా పోలీసులు గుర్తించారు. శవాలు ఇంకా లభ్యం కాలేదని భారీగా వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. వీరంతా కొల్హాపూర్‌లోని ఫౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://youtu.be/9vMCCf4BBfw