- Advertisement -
డ్రంక్ అండ్ డ్రైవ్..ఈ పేరు వింటేనే మందుబాబుల గుండెలు బరువెక్కుతాయి. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో తాగి బయటకు రావాలంటేనే మందుబాబులు జంకుతున్నారు. ఇక వీకెండ్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పొరపాటున తాగి బయటకివచ్చామంటే పోలీసుల డ్రంక్ డ్రైవ్ టెస్టులో బుక్కవ్వాల్సిందే.
ఇకపై మందుబాబులకే కాదు పోలీసులకు కూడా షాకే తగలనుంది. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు పోలీసులు మందు కొట్టి ఉన్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాచకొండ సీపీ కీలకనిర్ణయం తీసుకున్నారు.
ఇకపై డ్యూటీకి హాజరయ్యే పోలీసులకు రోజుకు రెండుసార్లు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు, తిరిగి వెళ్లెటప్పుడు మద్యం తాగారా..?లేదా అన్న విషయాన్ని పరీక్షించనున్నారు. రాచకొండ సీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.
- Advertisement -